

శీతాకాలంలో చాలామంది తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేయించిన పదార్థాలు, స్వీట్లు, అధిక కొవ్వు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం దీనికి ప్రధాన కారణమని వెల్లడిస్తున్నారు. చలికాలంలో శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందనే కారణంతో ఆకలి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు సాధారణం కంటే ఎక్కువగా తినే అవకాశముంది.
నెయ్యి, సమోసాలు, పకోడీలు వంటి వేయించిన ఆహారాలు, అలాగే రెడ్ మీట్ వంటి అధిక కొవ్వు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు ఇలాంటి ఆహారాలను తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, చక్కెర వినియోగాన్ని తగ్గించడం, వ్యాయామం చేయడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.












.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!