
న్యూస్

నలుగురు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు వచ్చినట్లు సమాచారం. కందుల దుర్గేష్, అనగాని సత్యకుమార్, కొల్లు రవీంద్ర తదితర మంత్రులకు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలతో లేఖలు పంపినట్లు తెలిసింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆందోళనకు దారితీసింది.
ఈ విషయంపై మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేఖల వ్యవహారం అసెంబ్లీ లాబీలో విస్తృత చర్చకు దారితీసింది. ప్రజాప్రతినిధుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా, లేఖల మూలాన్ని గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!