
జనరల్

శ్రీహరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పెళ్ళైంది కాని NO కహాని’ సినిమా పోస్టర్‌ను హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. స్మిత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మై3 సినిమాస్ నిర్మిస్తుండగా, ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీహరి, డైరెక్టర్ ఏడుకొండలు తాడిశెట్టి, ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినిమా పూర్తి కామెడీతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుందని టీమ్ తెలిపింది. వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని, సెన్సార్ పనులు త్వరలో పూర్తవుతాయని వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!