
జనరల్

నిఖిల్ సిద్ధార్థ్ ప్రముఖ ఫాంటసీ సూపర్ హీరో హీ మ్యాన్ కు తెలుగు వెర్షన్లో గాత్రదానం చేయడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. చిన్నతనంలో టెలివిజన్‌లో హీ-మ్యాన్‌ను చూసి పెరిగిన తాను, ఇప్పుడు అదే పాత్రకు స్వరం అందించడం భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు. తాను అభిమానించిన హీరోను కొత్త తరం ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం రావడం తన కెరీర్లో చిరస్మరణీయ ఘట్టమని అన్నారు.
హీ మ్యాన్, మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ చిత్రం జూన్ 5న ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ట్రావిస్ నైట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నికోలస్ గాలిట్జైన్, కమిలా మెండిస్, జారెడ్ లెటో, ఇడ్రిస్ ఎల్బా కీలక పాత్రలు పోషించారు. అంతర్జాతీయ చిత్రానికి ఈ స్థాయిలో అనుబంధం కలగడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు నిఖిల్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!