
జనరల్

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓటరు జాబితా సవరణపై వర్క్‌షాప్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని, పని చేసినంత కాలం పదవికి ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన అన్నారు.
ఈ నెల 4వ తేదీన ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలు కలిసి పనిచేయాలని, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!