
జనరల్

లెజెండరీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు సినిమా అభివృద్ధిలో ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన సేవలను కొనియాడారు.
తెలుగు చిత్రసీమకు ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించిన ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల వల్లే పరిశ్రమ స్వర్ణయుగాన్ని చూసిందని ఆయన అన్నారు. యమలీల, ఘటోత్కచుడు, ఎగిరే పావురమా వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాల పాటు అలరించాయని గుర్తు చేశారు. ఒకప్పుడు కుటుంబ వాతావరణంతో కళకళలాడిన సినీ పరిశ్రమ మళ్లీ అలాంటి రోజులను చూడాలని ఆకాంక్షించారు. ఎస్వీ కృష్ణారెడ్డి శతాయుష్షుతో ఆరోగ్యంగా జీవిస్తూ మరెన్నో విజయాలను సాధించాలని కోరుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!