
రాజకీయాలు

సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగానే మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులకు ఇచ్చే కారుణ్య నియామకాలకు పెళ్లైన కుమార్తెలు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. వివాహం జరిగిందనే ఒక్క కారణంతో మహిళల హక్కులను నిరాకరించడం సమంజసం కాదని న్యాయస్థానం పేర్కొంది.
వివాహం ఒక మహిళ అర్హతను లేదా ఆమె తన తల్లిదండ్రులపై ఆధారపడే పరిస్థితిని మార్చదని కోర్టు అభిప్రాయపడింది. కారుణ్య నియామకాల విషయంలో కుమారులతో పాటు పెళ్లైన కుమార్తెలకు కూడా సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని స్పష్టం చేసింది. మహిళల హక్కులు, లింగ సమానత్వానికి ఈ తీర్పు మరింత బలాన్ని చేకూర్చనుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!