

క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ బ్యానర్‌పై అశోక్ నిమ్మల నిర్మాణంలో, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన అరేయ్ అపండ్రా చిత్రంలో సుదర్శన్, భద్రం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎస్ ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ, ఈ సినిమా తన కెరీర్లో అత్యంత సవాల్‌గా నిలిచిన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పేర్కొన్నారు.
సంగీత రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం, ఈటీవీలో పదేళ్ల సేవలు, దాదాపు 50 చిత్రాలకు సంగీతం అందించినప్పటికీ, అరేయ్ అపండ్రా ప్రత్యేకమైన అనుభవంగా మిగిలిందని వెంకటేష్ తెలిపారు. సినిమా విడుదలకు ముందు కేవలం వారం రోజుల్లోనే మొత్తం ఆడియో పనులను పూర్తి చేయాల్సి రావడం పెద్ద సవాల్‌గా మారిందన్నారు. టాలీవుడ్ టైమ్స్ ఛానెల్లో సినిమా ప్రసారమైన సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ చిత్రం తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!