

ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, ఆ డిమాండ్‌ను తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్–తిరుపతి మార్గంలో పెరుగుతున్న రద్దీ కారణంగా, డిసెంబర్ 11 న ఈ ప్రత్యేక రైలును (07690) నడిపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
అలాగే చర్లపల్లి–మంగళూరు జంక్షన్, మంగళూరు జంక్షన్–చర్లపల్లి, చర్లపల్లి–మంగళూరు సెంట్రల్, మంగళూరు సెంట్రల్–చర్లపల్లి మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను తాత్కాలికంగా ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
డిసెంబర్లో ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను దక్షిణ మధ్య రైల్వే ఇలా విడుదల చేసింది:
డిసెంబర్ 24: చర్లపల్లి–మంగళూరు జంక్షన్ (07267)
డిసెంబర్ 26: మంగళూరు జంక్షన్–చర్లపల్లి (07268)
డిసెంబర్ 28: చర్లపల్లి–మంగళూరు సెంట్రల్ (07269)
డిసెంబర్ 30: మంగళూరు సెంట్రల్–చర్లపల్లి (07270)
డిసెంబర్ 11: హైదరాబాద్–తిరుపతి (07690)
ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అదనపు సౌకర్యం కల్పిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!