

లోకమాత అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘన నివాళులర్పించారు. సామాజిక మాధ్యమ వేదిక X ద్వారా విడుదల చేసిన సందేశంలో అహల్యాబాయి హోల్కర్ చూపిన అపారమైన బుద్ధికుశలత, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధతను దేశ ప్రజలు అత్యంత గౌరవంతో స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు.
అహల్యాబాయి హోల్కర్ జీవితం సుపరిపాలన, దేశభక్తి, సాంస్కృతిక గర్వానికి ప్రతీకగా నిలిచిందని ప్రధాని కొనియాడారు. ధైర్యం, కర్తవ్యనిష్ఠతో ఆమె నాయకత్వం వహించారని గుర్తు చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం, సంక్షేమం అందించేందుకు ఆమె చేసిన కృషి అసమానమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణంలో ఆమె చేసిన సేవలు భారతీయ సాంస్కృతిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేశాయని తెలిపారు. సమాజం, సంస్కృతి, దేశ నిర్మాణం పట్ల ఆమె అంకితభావం రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని మోదీ అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!