
క్రీడలు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) 2026 రాసే అభ్యర్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. టీజీ టెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ, జూన్ 16 నుంచి జూన్ 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను వివిధ సెషన్లలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రతిరోజూ మొదటి సెషన్ పరీక్షలు ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించబడతాయి. అభ్యర్థులు తమ పరీక్షల పూర్తి వివరాలు, షెడ్యూల్ మరియు ఇతర సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా తెలుసుకోవాలని టీజీ టెట్ కన్వీనర్ సూచించారు. పరీక్షలకు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!