
క్రీడలు

ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు పొదుపు చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (Department of Financial Services) ఈ మేరకు సర్క్యులర్ జారీ చేస్తూ వ్యయ నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది.
ఈ చర్యల్లో భాగంగా విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని, అధికారిక అవసరాల కోసం దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించింది. ఈ మార్గదర్శకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రధాన సంస్థల అధిపతులకు పంపినట్లు సమాచారం. సమర్థవంతమైన, స్థిరమైన ఆర్థిక నిర్వహణ కోసం ఈ చర్యలు కీలకమని కేంద్రం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!