
సినిమాలు

లెజెండరీ గాయని ఆశా భోస్లే (92) మరణంతో భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎనిమిది దశాబ్దాల పాటు తన మధుర గాత్రంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఆమె మరణం తీరని లోటుగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమె మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, కరణ్ జోహార్ తదితర ప్రముఖులు ఆమెకు ఘన నివాళులర్పించారు. ఆమె స్వరం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆశా భోస్లే అంత్యక్రియలు శివాజీ పార్క్‌లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!