
సినిమాలు

కాంతార సినిమాకు సంబంధించిన వివాదానికి నటుడు రణ్వీర్ సింగ్ ముగింపు ఇచ్చినట్లు సమాచారం. గతంలో ఒక అవార్డుల వేడుకలో సినిమాలోని సన్నివేశాన్ని అనుకరించడంతో కర్ణాటకలో ఆగ్రహం వ్యక్తమైంది. భూత కోల సంప్రదాయాన్ని అవమానించారన్న ఆరోపణలతో కేసు కూడా నమోదైంది.
ఈ నేపథ్యంలో రణ్వీర్ సింగ్ మరోసారి కోర్టుకు క్షమాపణ పత్రం సమర్పించారు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకు గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించాలనే ఉద్దేశాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ తాజా పరిణామాలతో వివాదం ముగిసే దిశగా వెళ్తోందని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!