
న్యూస్

ప్రపంచ బ్యాంక్ భారత జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతం వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 7.6 శాతంతో పోలిస్తే ఒక శాతం తక్కువ. అలాగే నిన్న జరిగిన సమీక్షలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంచనా వేసిన 6.9 శాతంతో పోల్చితే ఇది 0.3 శాతం తక్కువగా ఉంది. గత ఏడాది అక్టోబరులో విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంక్ 2026-27లో భారత జీడీపీ వృద్ధి 6.3 శాతం వరకు ఉండవచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇంధన రంగంలో ఒత్తిడుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, దేశీయ డిమాండ్ మరియు వినియోగం భారత జీడీపీ వృద్ధికి ప్రధాన మద్దతుగా నిలుస్తాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!