

ఇటీవల విడుదలైన బాలీవుడ్ స్పై-యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ది రివేంజ్ బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది శాశ్వత్ సచ్దేవ్ సంగీతం. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విజయంతో శాశ్వత్కు వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఈ యువ సెన్సేషన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఈ ఏడాదే ఒక భారీ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశముందని సమాచారం.
అలాగే, నేచురల్ స్టార్ నాని తదుపరి సినిమా బ్లడీ రోమియో టీమ్ కూడా శాశ్వత్‌ను అప్రోచ్ చేసింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా షూటింగ్ ది పారడైజ్ పూర్తయిన తర్వాత ప్రారంభం కానుంది. మేకర్స్ ఇప్పటికే శాశ్వత్‌తో చర్చలు జరుపి ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ అందించాలని భావిస్తున్నారు. బ్లడీ రోమియో నాని కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా, ప్రధాన షూటింగ్ లండన్‌లో జరుగనుంది. ఈ రెండు టాలీవుడ్ భారీ ప్రాజెక్టులలో శాశ్వత్ ఏదానికి సైన్ చేస్తాడో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!