

ఆర్టెమిస్-2 యాత్రలో భాగంగా చందమామను చుట్టివచ్చిన వ్యోమగాములు ఇప్పుడు భూమి వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఒరాయన్ వ్యోమనౌక జాబిల్లి వెనుక భాగానికి చేరుకొని యూ టర్న్ తీసుకుని తిరిగి భూమివైపు దూసుకెళ్తోంది. ఈ ప్రయాణంలో వ్యోమగాములు చంద్రుడి మరో వైపు అద్భుత దృశ్యాలను వీక్షించడంతో పాటు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని గ్రహాలను కూడా దూరం నుంచి దర్శించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యోమగాములతో మాట్లాడి అభినందనలు తెలిపారు. భూమి నుంచి 4 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించి, గత అపోలో మిషన్ రికార్డులను అధిగమించడం ఈ యాత్ర ప్రత్యేకతగా నిలిచింది.
చంద్రుని చుట్టే ప్రక్రియలో వ్యోమగాములు విస్తృత పరిశీలనలు నిర్వహించారు. శక్తివంతమైన కెమెరాలతో చంద్రుడిపై బిలాలు, అంతరిక్ష శిలల ప్రభావాలు వంటి అంశాలను చిత్రీకరించారు. ఒకే ఫ్రేమ్‌లో భూమి, చంద్రుడిని బంధించడం విశేషం. కొత్తగా గుర్తించిన బిలాలకు పేర్లు పెట్టాలని కూడా వారు అభ్యర్థించారు. ఈ యాత్రలో భావోద్వేగ క్షణాలు కూడా చోటుచేసుకున్నాయి. త్వరలో ఒరాయన్ వ్యోమనౌక పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవ్వనుండగా, ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిగా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!