
న్యూస్

సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తున్న సమయంలో, కాకినాడ జిల్లా మన్యం గ్రామ పరిధిలోని సార్లంకపల్లె గ్రామాన్ని ఘోర అగ్నిప్రమాదం విషాదంలోకి నెట్టింది. ఈ ప్రమాదంతో సుమారు 40 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డుపాలయ్యాయి.
పండుగకు అవసరమైన సరుకుల కోసం గ్రామస్థులు సమీపంలోని తుని పట్టణానికి వెళ్లారు. తిరిగి గ్రామానికి వచ్చేసరికి, తమ ఇళ్లు మంటల్లో కాలిపోయి బూడిదగా మారిన దృశ్యాన్ని చూసి షాక్కు గురయ్యారు. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే తుని నుంచి ఫైరింజిన్ బయలుదేరినా, దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉండటంతో అక్కడికి చేరేసరికి నష్టం తీవ్రంగా జరిగింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ లీక్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
_1771477764226.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!