
రివ్యూస్

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో ఈడీ అధికారులు నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్, ధనుంజయ రెడ్డి ఇళ్లల్లో ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. సిట్ నివేదిక ఆధారంగా హైదరాబాద్, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో కూడా అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు.
మద్యం వ్యాపారంలో అక్రమంగా సంపాదించిన ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించి లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించింది. గత దర్యాప్తుల ప్రకారం దాదాపు రూ.1000 కోట్ల వరకు ముడుపులు మార్గమార్పిడి అయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!