

ధురంధర్ 2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,783 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో ఇండియాలోనే రూ.1360 కోట్లు (గ్రాస్) రాబట్టగా, ఓవర్సీస్లో రూ.423 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో పాకిస్థాన్ రాజకీయ నాయకుడు జమీల్ జమాలీ పాత్రలో రాకేశ్ బేడీ తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన “బచ్చా హై తు మేరా” అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజా ఇంటర్వ్యూలో రాకేశ్ బేడీ మాట్లాడుతూ, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆ డైలాగ్ చెప్పమని అడుగుతున్నారని తెలిపారు. మొదటి భాగం విడుదలైనప్పుడు ఈ డైలాగ్ పెద్దగా గుర్తింపు పొందలేదని, కానీ ‘ధురంధర్: ది రివెంజ్’ తర్వాత భారీగా ట్రెండ్ అయ్యిందని చెప్పారు. సినిమాలో చిన్న పాత్ర చేసినా, దాని ప్రభావం పెద్దగా ఉందని, ప్రతి పాత్రకూ మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ‘ధురంధర్’ ఫ్రాంచైజీగా కొనసాగుతుందని, మూడో భాగంపై ఆసక్తి ఉన్నప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!