4225-1768468351.png&w=3840&q=75)

చిత్రం: పరమపద సోపానం
విడుదల తేదీ: 24-04-2026
నటీనటులు: అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, అజయ్ రత్నం, పిల్లా ప్రసాద్, మెహబూబ్ బాషా, జ్యోతి, అమిత్ తదితరులు
దర్శకుడు: నాగ శివ
నిర్మాతలు: గణపర్తి నారాయణరావు
సహ నిర్మాతలు: తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు, పులగం సుప్రియ
లైన్ ప్రొడ్యూసర్: పసుపులేటి సౌమ్య
నిర్మాణ సంస్థ: స్వయంభూ క్రియేషన్స్
సంగీత దర్శకుడు: డేవ్ జాండ్
సినిమాటోగ్రాఫర్: ఈశ్వర్
పీఆర్ఓ: ఫణి కుమార్ పులపర్తి
కథ:
హెల్త్ కమిషనర్ సత్య ప్రకాష్ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ కేసును చేధించేందుకు అశ్వద్దామ రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా గేమ్ డిజైనర్ అర్జున్‌ను గుర్తిస్తాడు. PTSD సమస్యతో బాధపడుతున్న అర్జున్ తనను ఎవరో చంపేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడుతూ ఉంటాడు. ఇదే సమయంలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగుల హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అర్జున్‌ను టార్గెట్ చేస్తున్నది ఎవరు? పాలకడలి గ్రామంతో ఈ ఘటనలకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్లు:
దర్శకుడు నాగ శివ తన తొలి సినిమాతోనే మంచి పట్టు చూపించాడు. సస్పెన్స్, కామెడీ, యాక్షన్ అంశాలను సమతూకంగా మేళవించాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సీరియల్ కిల్లింగ్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతాయి. సెకండాఫ్‌లో కథ వేగంగా సాగి, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మెహబూబ్ బాషా కామెడీ మంచి వినోదాన్ని అందిస్తుంది. అర్జున్ అంబటి తన నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే రెయిన్ ఫైట్ హైలైట్‌గా నిలుస్తుంది. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ పోలీస్ పాత్రలో బలమైన నటన కనబరిచింది. డేవ్ జాండ్ సంగీతం, పాటలు సినిమాకు మంచి బలం అయ్యాయి.
మైనస్ పాయింట్లు:
ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల కొద్దిగా నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు మరింత బలంగా రాసి ఉంటే సినిమా ఇంకా మెరుగ్గా ఉండేది. అయితే మొత్తం కథనం ఆసక్తికరంగా ఉండటంతో ఈ లోపాలు పెద్దగా ఇబ్బంది కలిగించవు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు నాగ శివ కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్‌ను కూడా బాగా చూపించాడు. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి విజువల్ క్వాలిటీ తీసుకొచ్చింది. డేవ్ జాండ్ నేపథ్య సంగీతం, పాటలు సినిమాను మరింత ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
మొత్తంగా ‘పరమపద సోపానం’ సస్పెన్స్, యాక్షన్, కామెడీ, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన కమర్షియల్ థ్రిల్లర్. సెకండాఫ్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు సినిమాకు ప్రధాన బలం. మాస్ ప్రేక్షకులతో పాటు థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఎంపికగా నిలుస్తుంది.
రేటింగ్: 2.75/5










4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)






.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!