

బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టీసి కార్మికులకు చేసిన వాగ్దానాలను అమలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన శంకర్ గౌడ్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆయన మృతదేహాన్ని డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా కార్మిక సంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని దారుణ చర్యగా పేర్కొన్నారు.
అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని, కుటుంబ సభ్యుల కోరిక మేరకు డిపో వద్ద నివాళులు అర్పించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఒకేరోజు పలువురు ఆర్టీసి డ్రైవర్లు ఆత్మహత్యాయత్నాలు చేయడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.




.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!