

ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్‌కు ఇప్పటికే 50 కోట్లకు పైగా టికెట్ అభ్యర్థనలు వచ్చినట్లు ఫిఫా వెల్లడించింది. తాజాగా ఫైనల్ మ్యాచ్ కోసం నాలుగు ప్రత్యేక రీసేల్ టికెట్లు ఒక్కోటి 2.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.21 కోట్లు) ధరతో విడుదల చేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జూలై 19న న్యూజెర్సీలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఈ సీట్లు బ్లాక్-124, లైన్-45లో (33 నుంచి 36 వరకు) అందుబాటులో ఉంటాయి. ఇతర టికెట్ ధరలను కూడా ఫిఫా ప్రకటించగా, టాప్ కేటగిరీ టికెట్ ధర $10,990 (సుమారు రూ.10.19 లక్షలు)గా నిర్ణయించారు. జూన్ 11 నుంచి జూలై 19 వరకు 39 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో 48 జట్లు పాల్గొని, మూడు దేశాల్లోని 16 వేదికల్లో మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని 211 సభ్య దేశాల్లో ఫుట్‌బాల్ అభివృద్ధికి వినియోగించనున్నట్లు ఫిఫా తెలిపింది.






.webp&w=3840&q=75)








.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!