

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)’ ద్వారా వచ్చే 2026-27 విద్యాసంవత్సరానికి మూడు విడతలుగా అడ్మిషన్లు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈ నెల 15 నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మూడు విడతల ప్రక్రియ పూర్తయ్యాక జూన్ 20 నుంచి 27 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు.
ఈసారి ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లోని కొన్ని మేనేజ్మెంట్ కోర్సులను దోస్త్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. గత ఏడాది 4.40 లక్షల సీట్లలో 2.05 లక్షలు మాత్రమే భర్తీ కాగా, ఈసారి ఇంటర్ ఫలితాల శాతం పెరగడంతో అడ్మిషన్లు కూడా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన వంటి విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో వివిధ డిగ్రీ కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 కాగా, తదుపరి విడతల్లో కొత్తగా నమోదు చేసుకునేవారికి రూ.400గా నిర్ణయించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!