.jpg&w=3840&q=75)
రాజకీయాలు

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2026 ఖరీఫ్ సీజన్ కోసం ఎరువులపై సబ్సిడీని భారీగా పెంచింది. ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులపై సబ్సిడీ మొత్తం రూ.41,534 కోట్లకు పెరిగింది. 2025 ఖరీఫ్ సీజన్‌లో ఇది రూ.37,216 కోట్లుగా ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈ సబ్సిడీ పెంపునకు ఆమోదం తెలిపింది. 2026 ఈ నెల 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొత్త సబ్సిడీ అమల్లో ఉంటుంది.
రాబీ సీజన్‌లో నైట్రోజన్‌పై కిలోకు రూ.43.02 ఇచ్చిన కేంద్రం 2026 ఖరీఫ్‌లో దానిని రూ.47.32కి పెంచింది. ఫాస్పేట్ సబ్సిడీ కిలోకు రూ.47.96 నుంచి రూ.52.76కి, సల్ఫర్ సబ్సిడీ కిలోకు రూ.2.87 నుంచి రూ.3.16కి పెరిగింది. పొటాష్ సబ్సిడీలో మార్పు చేయకపోయారు, కిలోకు రూ.2.38 వరకే కొనసాగుతుంది.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!