
సినిమాలు

జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై కోర్టు ఇప్పటికే వాదనలు పూర్తిచేసి, బుధవారం తీర్పు ఇవ్వాల్సి ఉండగా వాయిదా వేసింది.
2024 మార్చి 14న జారీ చేసిన జీఓ నంబర్ 6 ద్వారా ఈ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!