
బిజినెస్

భారతదేశంలో అత్యంత వేగంగా మరియు విస్తృతంగా ఉపయోగిస్తున్న డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐపై కొత్త భద్రతా నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశీలిస్తోంది. ప్రస్తుతం యూపీఐ ద్వారా రోజుకు ₹1,00,000 వరకు ఎలాంటి పెద్ద పరిమితులు లేకుండా తక్షణ చెల్లింపులు చేయవచ్చు.
అయితే, తాజా సమాచారం ప్రకారం ₹10,000 పైగా ఉన్న లావాదేవీలకు ఒక గంట పాటు హోల్డ్ విధించే ప్రతిపాదనపై RBI చర్చిస్తోంది. ఈ సమయంలో వినియోగదారుడు కావాలంటే ఆ లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ఈ చర్యను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫిషింగ్ లింకులు మరియు నకిలీ UPI అభ్యర్థనల వల్ల ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతున్న ఘటనలు పెరిగాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!