

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో జరగబోయే తన వివాహానికి ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు ఆయన సీఎం కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని స్వీకరించి, నూతన వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.
సాయి శ్రీనివాస్–కావ్యా రెడ్డి జంట వివాహం “శ్రీనివాసకావ్యానం” పేరుతో ఈ నెల 29, 2026న తిరుమలలో సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఇటీవల హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. వివాహానికి ముందు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్న సాయి శ్రీనివాస్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులను కూడా కలుస్తున్నారు. వివాహానంతరం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించే అవకాశం ఉంది.

.jpg&w=3840&q=75)







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!