
టెక్నాలజీ

ఢిల్లీ లోని ఎర్రకోట (Red Fort) సమీపంలో పేలిన హ్యుందాయ్ i20 కారుతో పాటు, ఆ టెర్రరిస్ట్కు మరో కారు కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడు మరో వాహనాన్ని ఉపయోగించి ప్రయాణించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా , ఉత్తరప్రదేశ్ పోలీసు బృందాలు ఫోర్డ్ కంపెనీకి చెందిన ఎకోస్పోర్ట్ రెడ్ కలర్ కారును గాలిస్తున్నాయి. జాతీయ మాధ్యమాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ కారు ఉమర్ నబీ పేరుతో నమోదు చేయబడి ఉంది. వాహనం నంబర్ DL10CK0458 అని సమాచారం.
పోలీసులు వాహనం వెతకడంలో వేగం పెంచి, సీసీటీవీ ఫుటేజ్ మరియు వాహన రికార్డులను పరిశీలిస్తున్నారు. కేసు విచారణను అన్ని దిశల్లో కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!