
రాజకీయాలు

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం భయంకర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలు నిలిచివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ ఆదేశించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!