
క్రీడలు
.jpg&w=3840&q=75)
హైదరాబాద్ క్రికెట్ సంఘంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సీబీసీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే అపెక్స్ కౌన్సిల్‌ను న్యాయమూర్తి నవీన్ రావు పర్యవేక్షణలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోలేరని పేర్కొంది. అక్రమాలు జరిగినప్పుడు పారదర్శకత కోసం కోర్టులు జోక్యం చేసుకుంటాయని న్యాయమూర్తి నగేశ్ భీమపాక తెలిపారు. దర్యాప్తుకు సంబంధిత అధికారులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని కోర్టు ఆదేశించింది.











.jpg&w=3840&q=75)
.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!