
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆయన ఇప్పటివరకు మొత్తం 800 ఫోర్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శిఖర్ ధవన్ 768 ఫోర్లతో రెండో స్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్ 663 ఫోర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ 653 ఫోర్లతో నాలుగో స్థానంలో ఉండగా, అజింక్య రహానే 522 ఫోర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. సురేష్ రైనా 506 ఫోర్లు, గౌతమ్ గంభీర్ 492 ఫోర్లతో తదుపరి స్థానాల్లో నిలిచారు. ఈ రికార్డు ద్వారా కోహ్లీ తన స్థిరత్వం మరియు అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించాడు.











.jpg&w=3840&q=75)
.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!