

ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ రూ.16,971 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.19,407 కోట్లతో పోలిస్తే లాభంలో 12.5 శాతం తగ్గుదల కనిపించింది. అలాగే డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.18,645 కోట్ల లాభాన్ని సాధించింది.
ప్రస్తుతం ఉన్న చమురు సంక్షోభం కారణంగా కంపెనీకి చెందిన ఆయిల్ మరియు రసాయన వ్యాపారంపై ప్రభావం పడింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం పెరుగుదల చూపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2.69 లక్షల కోట్లుగా ఉన్న ఆదాయం, ఈసారి రూ.3.03 లక్షల కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.80,775 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16 శాతం వృద్ధిని సూచిస్తోంది. త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీకి చెందిన జియో విభాగం లాభం 13 శాతం పెరిగి రూ.7,935 కోట్లకు చేరుకుంది. ఒక వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం కూడా రూ.206.2 నుంచి రూ.213కు పెరిగింది.











.jpg&w=3840&q=75)
.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!