
క్రీడలు
.jpeg&w=3840&q=75)
ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొన్నట్లు సమాచారం. ముఖ్యంగా విజయవాడలో గ్యాస్ ఏజెన్సీల ముందు పెద్ద సంఖ్యలో వినియోగదారులు క్యూలు కడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది వినియోగదారులు గ్యాస్ బుక్ చేయకపోయినా, తమ పేర్లపై బుకింగ్ జరిగినట్లు మెసేజ్లు రావడంతో ఆ సందేశాలను చూసుకుని ఏజెన్సీలకు చేరుకుంటున్నారు.
అయితే ఆ మెసేజ్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వినియోగదారులు మాత్రం కొందరు సిలిండర్లు బుక్ చేసి వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితితో వినియోగదారుల్లో గందరగోళం నెలకొనగా, అధికారులు సమస్యపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!