

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపశమనం కోసం చాలామంది కూల్‌డ్రింక్స్, పండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పుచ్చకాయ వేసవిలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్లలో ఒకటి. శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని అందించడంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పుచ్చకాయను సరైన విధంగా తినకపోతే ప్రయోజనం కంటే హానికర ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల సూచనల ప్రకారం, బయట నుంచి తెచ్చిన వెంటనే పుచ్చకాయ కోసి ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదని చెబుతున్నారు. కోసిన పండును ఫ్రిజ్‌లో ఉంచితే సహజ పోషకాలు తగ్గిపోవడంతో పాటు త్వరగా బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి తినడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ మిగిలితే గాలి చొరబడకుండా మూతపెట్టి వీలైనంత త్వరగా వినియోగించాలి.
పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉండటంతో, తిన్న వెంటనే మళ్లీ నీళ్లు తాగడం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీని వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, వాంతులు లేదా విరేచనాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత కనీసం 30 నుంచి 45 నిమిషాల వరకు నీరు తాగకపోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే పుచ్చకాయను అతిగా తినకూడదని, రోజుకు ఒక చిన్న గిన్నెడు ముక్కలు లేదా 2 నుంచి 3 పెద్ద ముక్కలు సరిపోతాయని పేర్కొంటున్నారు. కడుపు భారంగా అనిపించే వారు కొద్దిగా నల్ల ఉప్పు చల్లి తింటే జీర్ణక్రియకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. బయట కట్ చేసిన ముక్కలు కొనకూడదని, నమ్మకమైన చోట నుంచే పండును కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. పండు కోసిన తర్వాత నీరు కారడం లేదా వాసన రావడం గమనిస్తే దానిని తినకూడదని హెచ్చరిస్తున్నారు.













.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!