

సినీ నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తాను ఏ కులం, మతానికి చెందనని అధికారికంగా గుర్తించే ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ ధ్రువపత్రం పొందాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, పార్తిబన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. సంబంధిత అధికారులు ఈ నెల 29లోపు ఆ ధ్రువపత్రాన్ని జారీ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పార్తిబన్, తన నిర్ణయానికి కారణాలను వెల్లడించారు. కులమతాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని, ఇటీవల ఒక కార్యక్రమంలో అనుకోకుండా కులం పేరు ప్రస్తావించడంతో చాలామంది బాధపడ్డారని చెప్పారు. ఆ సంఘటన తనను ఆలోచనలో పడేసిందని, అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను ఏ కులం, మతానికి చెందనివాడినని తెలిపే ధ్రువపత్రం పొందడం ద్వారా సమాజంలో మార్పుకు నాంది పలకాలనుకుంటున్నానని పేర్కొన్నారు. కులం ఆధారంగా లభించే ఎలాంటి ప్రయోజనాలు తనకు అవసరం లేదని, కష్టపడి ఎదగడమే తన నమ్మకమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, సమాజంలో సానుకూల మార్పు కోసం తీసుకున్న అడుగని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!