
న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సచివాలయంలో రహదారులు, భవనాలు, రవాణాశాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల నిర్వహణ, పాత్‌హోల్ ఫ్రీ రోడ్లు, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని సీఎం ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులను పరిశీలించి వాటి ఆధారంగా రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని తెలిపారు. అలాగే తక్కువ వ్యయంతో ప్రజా రవాణా అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!