
న్యూస్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా భారీ విజయాన్ని సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రాబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రజనీకాంత్ మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు.
అలాగే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే ఉంటుందని చెప్పారు. మొదటి భాగం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదలై విజయాన్ని సాధించిన నేపథ్యంలో, ఈ సీక్వెల్ కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలో విద్యాబాలన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ ప్రత్యేక పాత్రల్లో మళ్లీ కనిపించనున్నట్లు తెలుస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!