

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో అరెస్టయ్యాడు. సిడ్నీ పోలీసులు మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించాయి. రోడ్డుపై పోలీసులు నిర్వహిస్తున్న బ్రీత్ టెస్టింగ్‌ను గమనించిన వార్నర్ తన వాహనాన్ని పక్కకు ఆపాడు. అనుమానం వచ్చిన అధికారులు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్ష చేయగా, అతడు పరిమితికి మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం.
అనంతరం వార్నర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి, బెయిల్‌పై విడుదల చేశారు. ఈ కేసులో అతడు వచ్చే నెల కోర్టు ముందు హాజరుకానున్నాడు. ప్రస్తుతం వార్నర్ పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల వ్యక్తిగత సెలవుపై ఆస్ట్రేలియాకు తిరిగొచ్చిన అతడు, త్వరలోనే మళ్లీ పాకిస్థాన్‌కు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.



.webp&w=3840&q=75)









.jpeg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!