
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజులో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. “తల్లికి వందనం” పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు.
అదే విధంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు 50 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో రోడ్లను మెరుగుపరిచామని, పంచాయతీ రోడ్ల అభివృద్ధికి రూ.4 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఏరోస్పేస్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన సీఎం, ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!