
క్రీడలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో ముంబై ఇండియన్స్‌తో వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. ఓపెనర్‌గా దిగిన అతడు జట్టుకు బలమైన ఆరంభం అందిస్తూ 20 ఓవర్లలో 207/6 స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో తన రెండో శతకం నమోదు చేసిన శాంసన్, మొత్తం ఐపీఎల్‌లో ఐదో శతకాన్ని కేవలం 54 బంతుల్లోనే పూర్తి చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సులు బాదుతూ జట్టు రన్‌రేట్‌ను నిలబెట్టాడు.
ఈ ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును శాంసన్ సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు 2021లో 58 బంతుల్లో 88 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉండేది. ఇప్పుడు శాంసన్ ఇన్నింగ్స్ ఈ రెండు జట్ల మధ్య పోటీల్లో సీఎస్‌కే తరఫున అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!