
సినిమాలు

తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మెపై గట్టి హెచ్చరిక జారీ చేశాయి. తమ డిమాండ్లు ఈ నెల 21వ తేదీ లోపు పరిష్కరించకపోతే, 22వ తేదీ నుంచి సమ్మె ప్రారంభిస్తామని స్పష్టం చేశాయి. ఈ సమ్మె గతంలో జరిగిన భారీ ప్రజా ఉద్యమాల తరహాలో విస్తరించే అవకాశముందని పేర్కొన్నాయి.
అన్ని కార్మిక సంఘాలు, జేఏసీకి చెందని సిబ్బంది కూడా ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నారని నాయకులు తెలిపారు. ప్రైవేట్ సిబ్బందిని ఉపయోగించి సమ్మెను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తగిన విధంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే 22వ తేదీ మొదటి షిఫ్ట్ నుంచే సమ్మె ప్రారంభమవుతుందని వెల్లడించారు.
















.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!