

విప్రోలో నియామకాల విధానంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. సంప్రదాయ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ మోడల్‌కు ఇక ముగింపు పలుకుతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫ్రెషర్ నియామకాలను కేవలం 7,500 మందికి పరిమితం చేసిన విప్రో, 2027 ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి హైరింగ్ టార్గెట్‌ను నిర్ణయించలేదని ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ కారణంగా గతంలో ఫ్రెషర్లు నిర్వహించిన అనేక పనులు ఇప్పుడు ఆటోమేషన్ ద్వారా జరుగుతున్నాయని కంపెనీ వెల్లడించింది.
విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ, సంస్థ ఇప్పుడు పూర్తిగా “AI-First World” వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. ఆదాయం పెరగడానికి పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించాల్సిన అవసరం ఇక తగ్గిందని చెప్పారు. 2026 బ్యాచ్ విద్యార్థుల కోసం “వేలల్లో ఉద్యోగాలు” ఇచ్చే కాలం ముగిసిందని స్పష్టం చేశారు.
ఇకపై విప్రో 50 ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా AIలో నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులను ఎంపిక చేయనుంది. అధిక మార్కులు, డిగ్రీ సర్టిఫికెట్ల కంటే ప్రాక్టికల్ స్కిల్స్, ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనుంది. కొత్త ఐటీ రంగంలో AIతో పని చేసే సామర్థ్యం లేనిపక్షంలో కేవలం డిగ్రీ మాత్రమే సరిపోదని సంస్థ సంకేతాలు ఇచ్చింది. నైపుణ్యాలు పెంచుకుంటేనే అవకాశాలు లభిస్తాయని విప్రో స్పష్టం చేసింది.









.jpg.webp&w=3840&q=75)



.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!