

గూగుల్ సీఈఓ Sundar Pichai కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం Google లో తయారవుతున్న కోడ్‌లో దాదాపు 75 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారానే రాస్తున్నట్లు వెల్లడించారు. లాస్ వెగాస్‌లో జరిగిన గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 2026 సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. 2025 ఏప్రిల్‌లో కేవలం 30 శాతంగా ఉన్న AI కోడింగ్, ఏడాది లోపే 75 శాతానికి పెరగడం విశేషం. ఏఐ ఇప్పుడు ఇంజనీర్లకు సహాయకారిగా కాకుండా ప్రధాన కోడ్ రచయితగా మారిందని ఆయన చెప్పారు.
అయితే దీనివల్ల ఉద్యోగాలు పోతాయనే భయంపై పిచాయ్ స్పష్టత ఇచ్చారు. ఏఐ ఇంజనీర్లను భర్తీ చేయదని, కానీ వారి పని విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఇంజనీర్లు కోడ్ రాయడం కంటే, ఏఐ రాసిన కోడ్‌ను పరిశీలించడం, ధృవీకరించడం, పెద్ద ప్రాజెక్టులను నిర్వహించడం వంటి బాధ్యతలపై దృష్టి పెడుతున్నారు. ఏఐ సహాయంతో ప్రాజెక్టులు మరింత వేగంగా పూర్తవుతున్నాయని, టెక్నాలజీ రంగంలో రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!