
న్యూస్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్ సమస్య తలెత్తడంతో అన్ని సేవలు స్తంభించిపోయాయి. భూముల రిజిస్ట్రేషన్లు, ఈసీ (EC), మార్కెట్ విలువ వివరాలు వంటి కీలక సేవలు నిలిచిపోవడంతో రాష్ట్రంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుని అవసరమైన పత్రాలతో వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సేవలు ఎప్పుడు పునరుద్ధరించబడతాయనే విషయంపై స్పష్టత లేదు. తక్షణమే సమస్యను పరిష్కరించి సేవలను పునఃప్రారంభించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)











.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!