

నటి రష్మిక, నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త దంపతులు తమ జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. పెళ్లి తర్వాత విహారయాత్ర కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లిన వీరిద్దరూ, అక్కడి ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో సంతోషంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను పంచుకుంటూ తమ అనుభవాలను వెల్లడించారు. పెళ్లి వేడుకల తర్వాత కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతిగా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావించామని ఆమె తెలిపారు.
ప్రశాంతమైన ఉదయాలు, స్విమ్మింగ్ పూల్‌లో గడిపిన మధ్యాహ్నాలు, సాయంత్రం టేబుల్ టెన్నిస్ ఆటలు, రాత్రిళ్లు నవ్వులు పంచుకునే సినిమాలతో గడిపిన సమయాలు తమకు మరపురాని అనుభూతిగా మారాయని చెప్పారు. కోహ్ సముయ్ దీవి తమకు స్వంత ఇంటిలా అనిపించిందని కూడా పేర్కొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. నాభర్త అని పిలవడానికి ఇంకా అలవాటు పడుతున్నానని రష్మిక చెప్పగా, నా ప్రియమైన స్నేహితురాలు అనే స్థానం ఎప్పటికీ మారదు అని విజయ్ స్పందించారు.
భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడినప్పుడు, వచ్చే ఐదేళ్లలో ప్రపంచాన్ని చుట్టి రావాలని రష్మిక తన కోరికను వ్యక్తం చేశారు. అందుకు తాను కూడా సిద్ధమని విజయ్ చెప్పడం విశేషం.
ఫిబ్రవరి 26 న వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం ‘రణబాలి’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.









.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!