

ఎల్పీజీ సరఫరా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని సూచించింది. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించేందుకు సిలిండర్ బుకింగ్‌ల మధ్య కనీసం 25 రోజుల గ్యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
దిగుమతి చేసుకునే ఎల్పీజీని ప్రధానంగా నాన్-డొమెస్టిక్ రంగాలకు కేటాయించాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలకు సరఫరా విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. రెస్టారెంట్లు, హోటళ్లకు ఎల్పీజీ సరఫరాపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ చర్యల ద్వారా ఎల్పీజీ సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెరిగి వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!