

ఇండిగో సిబ్బంది డ్రెస్సింగ్, వ్యక్తిగత అలంకరణ మార్గదర్శకాల పేరుతో కొన్ని పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళా సిబ్బంది మంగళసూత్రం, సింధూరం ధరించకూడదని, మెహందీ పెట్టుకోకూడదని, మతపరమైన దారాలు ధరించరాదని, పురుష సిబ్బందికి తిలకం అనుమతి లేదని ఆ పత్రాల్లో పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో సంస్థపై మతపరమైన వివక్ష ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వివాదంపై స్పందించిన ఇండిగో, వైరల్ అవుతున్న పత్రాలు పూర్తిగా నకిలీవని స్పష్టం చేసింది. అవి సంస్థ అధికారిక మార్గదర్శకాలు కావని తెలిపింది. ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, పంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది కోసం రూపొందించే విధానాలు భద్రత, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఉంటాయని కంపెనీ పేర్కొంది. సమానత్వం, సమ్మిళిత పని వాతావరణం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. ఇదే తరహా వివాదంలో ఇటీవల లెన్స్‌కార్ట్ కూడా నిలవగా, తమ సంస్థలో బిందీ, తిలకం వంటి అంశాలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆ సంస్థ సీఈఓ పీయూష్ బన్సల్ స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!