

కీర దోసకాయను మన రోజువారీ ఆహారంలో ఎక్కువగా సలాడ్ రూపంలో తీసుకుంటుంటాం. రుచి మాత్రమే కాదు, ఇందులో ఉన్న పోషకాలు కారణంగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయగా గుర్తింపు పొందింది. కీర దోసకాయలో అధికంగా నీరు ఉండటం వల్ల వేసవిలో దీన్ని తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. జీవక్రియలు సక్రమంగా సాగేందుకు ఇది సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపి శరీర శుద్ధికి దోహదపడుతుంది. కీర దోసలో విటమిన్ K, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా ఉండటం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
కీర దోసకాయలో ఉన్న లిగ్నన్స్ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వేసవిలో కీరా జ్యూస్‌లో కొద్దిగా పుదీనా వేసి తాగితే శరీరానికి చల్లదనం లభించి ఎండదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా ఇది సహాయపడుతుంది. కీర దోసలో ఉండే విటమిన్ B తలనొప్పిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందించడంలో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా కీరా జ్యూస్ తాగితే కడుపు సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అలాగే కీర దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచితే కళ్ల మంటలు, ఎర్రదనం తగ్గి కళ్లకు రిలీఫ్ లభిస్తుంది. అందుకే నిపుణులు కీర దోసకాయను సమగ్ర ఆరోగ్యానికి, ముఖ్యంగా వేసవిలో ఉత్తమమైన ఆహారంగా సూచిస్తున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!