

ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ క్షమాపణలు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఒక టీనేజర్ అభ్యంతరకర ప్రవర్తనను గుర్తించినప్పటికీ, సంబంధిత అధికారులను సమయానికి అప్రమత్తం చేయడంలో విఫలమయ్యామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆ టీనేజర్ సామూహిక కాల్పులకు పాల్పడటంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆల్ట్‌మన్ స్పందించారు.
ఫిబ్రవరిలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం టంబ్లర్ రిడ్జ్ ప్రాంతంలోని ఒక సెకండరీ పాఠశాలలో ఈ దారుణ ఘటన జరిగింది. 18 ఏళ్ల వాన్ రూట్సెల్లార్ తన తల్లి, సవతి సోదరుడితో పాటు మరో ఆరుగురు విద్యార్థులను కాల్చిచంపినట్లు సమాచారం. అనంతరం తుపాకీ గాయాలతో ఆమె కూడా మరణించింది. ఈ ఘటన అనంతరం టంబ్లర్ రిడ్జ్ ప్రజలను ఉద్దేశించి శామ్ ఆల్ట్‌మన్ లేఖ రాశారు. గత జూన్‌లోనే ఆమె ఆన్‌లైన్ ప్రవర్తనను గుర్తించి చాట్‌జీపీటీ ఖాతాను సస్పెండ్ చేసినప్పటికీ, ఆ విషయంపై పోలీసులను అప్రమత్తం చేయలేకపోయామని తెలిపారు. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబాలకు, స్థానిక ప్రజలకు జరిగిన నష్టంపై హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!